Green Land: ఉష వాన్స్ పర్యటనపై గ్రీన్ లాండ్ ప్రధాని అభ్యంతరం 16 d ago

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉష వాన్స్ గ్రీన్లాండ్ పర్యటనపై అక్కడి ప్రధాని మ్యూట్ బి. ఎగేడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రీన్ ల్యాండ్ విషయంలో అమెరికా అధిక ఆగ్రహంతో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ ల్యాండ్ ను అమెరికాలో విలీనం చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఉష వాన్స్ అక్కడ డాగ్ స్లెడింగ్ రేసును వీక్షించనున్నారు.